ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినందుకు వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు – చిరంజీవి

Thursday, March 25th, 2021, 04:42:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా కర్నూల్ లోని ఓర్వకల్లు లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినందుకు వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు అని చిరు పేర్కొన్నారు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, చరిత్ర గుర్తించని ఒక పోరాట యోధుడు అని, ఓ గొప్ప దేశ భక్తుడు అని వ్యాఖ్యానించారు. అటువంటి సమరయోధుడు పేరు కర్నూల్ విమానాశ్రయానికి పెట్టడం గర్వించదగ్గ విషయం అని వ్యాఖ్యానించారు. అలాంటి మహా యోధుడి పాత్రను తెరపై పోషించాను అని చిరు పేర్కొన్నారు. అయితే ఇది తనకు దక్కిన అదృష్టంగా చిరు అన్నారు. సైరా నరసింహ రెడ్డి చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ను తెరపై చూపించారు. అయితే ఆ పాత్ర పట్ల అప్పుడు సీఎం జగన్ ను సైతం కలిసి సినిమా చూడాల్సింది గా చిరు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూల్ విమానాశ్రయానికి ఆ యోధుడు పేరు పెట్టడం పట్ల చిరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.