ఆమెకు మాత్రమే ఆ గుర్తింపు దక్కింది: మెగా స్టార్

Wednesday, May 9th, 2018, 09:14:26 AM IST

మంచి సినిమాలు తెరకెక్కితే తన మద్దతు ఎప్పుడు ఉంటుందని మెగా స్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమా నేడు విడుదల కానున్న సందర్బంగా మెగా స్టార్ తన నుంచి సినిమా స్థాయి పెరిగేలా ప్రమోషన్స్ లో భాగమయ్యారు. అందుకు సంబందించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సావిత్రి గురించి మెగాస్టార్ తన మాటల్లో ఎంత గొప్పగా చెప్పారు. ,మెగాస్టార్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఉన్నప్పటికీ సావిత్రి మాత్రమే మహానటిగా గుర్తింపు పొందారు. తొలి నాళ్లలో నా కెరీర్ లో ఆమెతో నటించే అవకాశం రావడం నాకు చాలా తొందరగా లభించింది. ఆమెతో కలిసి నటించినందుకు నిజంగా గర్వపడుతున్నాను.

కళ్లతోనే అందమైన హావభావాలను చూపించగల గొప్ప నటి సావిత్రి గారు. నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తిప్రదాతగా ఈ చిరంజీవి మనసులో సావిత్రమ్మ ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారన్నారు. తనకు అభిమానమైన సావిత్రి గారి జీవితం తెరపై వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందుకోసం కష్టపడిన చిత్ర యూనిట్ ని ప్రశంసించాలని చెబుతూ మహానటి చిత్ర యూనిట్ కు మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు. ఇక మహానటి లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సమంత – విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో కనిపించినున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.