చిట్టిబాబు రికార్డుల మెగాస్టార్ ఏమన్నాడో తెలుసా ?

Tuesday, May 1st, 2018, 09:48:16 AM IST

రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రం 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డుల్లో మొదటి స్థానాన్ని అందుకున్న ఈ సినిమా వసూళ్ల గురించి మెగాస్టార్ స్పందిస్తూ తాను నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టాను ..100 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

అలాంటి నా రికార్డును చిట్టిబాబు దాటేసి సంచలనం క్రియేట్ చేసాడు. తప్పకుండా రంగస్థలం రికార్డులను సైరా బ్రేక్ చేస్తుందని అన్నాడు. మొత్తానికి చరణ్ విషయంలో మెగాస్టార్ ఓ తండ్రి గా పూర్తీ సంతృప్తితో ఉన్నాడు. ఇక మెగా ఫ్యామిలి మొత్తం సైరా విషయంలో చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments