కొరటాలకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

Saturday, June 2nd, 2018, 01:15:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 7 నుండి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తీ అయినట్టే. దాంతో మిగతా షూటింగ్ కుడా త్వరలోనే పూర్తీ చేయాలనీ ప్లాన్ చేసాడు చిరంజీవి, దాంతో పాటు అయన క్రేజీ దర్శకుడు కొరటాల శివకు ఓకే చెప్పినట్టు టాక్ ? కొరటాల శివ సినిమాకూడా సైరా గ్యాప్ లో చేయాలని ఫిక్స్ అయ్యాడట చిరు. అందుకే ఆయనకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. సైరా వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసారు కాబట్టి .. ఈ లోగ కొరటాల సినిమా విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారట. సో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ విషయంలో బిజీగా ఉన్న కొరటాల త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారట. లెటస్ట్ గా మహేష్ తో భరత్ అనే నేను తో సంచలన విజయం అందుకున్న కొరటాల శివ వెంటనే .. మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ పట్టేయడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments