చిరు జాతకం అలా ఫలించింది మరి ?

Thursday, April 5th, 2018, 10:29:01 PM IST


రంగస్థలం .. ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ సినిమా గురించే రచ్చ నడుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రేజీ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఇటీవలే విడుదలై ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే బాహుబలి రికార్డులను టచ్ చేసిన రంగస్థలం సినిమా విడుదలకు ముందు నిడివి విషయంలో దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడ్డారట. ముక్యంగా ఓరయ్యో .. నా అయ్యా అనే పాటను లేపెద్దమని అనుకున్నారట … ఆ విషయాన్నీ చిరు , చరణ్ లకు చెబితే .. చిరంజీవి మాత్రం ఆ పాటను ఖచ్చితంగా ఉంచండి. ఆ పాటకు ముందు, వెనక సన్నివేశాలు కూడా తొలగించొద్దు .. కావాలంటే ఎక్కడైనా కామెడీ సీన్ ని తీసేయండి .. క్లైమాక్స్ లో వచ్చే ఆ సాంగ్ జనాలకు బాగా ఎక్కుతుందని చెప్పాడట మెగాస్టార్. దాంతో ఆ సాంగ్ ని అలాగే ఉంచేశారు. సో ఇప్పుడు ఆ సినిమాలోనే ఆ సాంగ్ హైలెట్ కావడం .. ఆ సన్నివేశానికి ప్రతి ఒక్కరు కనెక్ట్ కావడంతో సినిమా ఫలితం ఓ రేంజ్ లో ఉంది. మొత్తానికి మెగాస్టార్ జాతకం అలా ఫలించిందన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments