అల్లుడి హిట్ కోసం రంగంలోకి దిగిన మామలు ?

Friday, June 8th, 2018, 12:46:30 AM IST

తన అల్లుడికి వరుస పరాజయాలు రావడంతో ఇద్దరు మామలు రంగంలోకి దిగారు. తన మేనల్లుడికి మంచి హిట్ అందించే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆ మెగా మామలు !! మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తేజ్ ఐ లవ్ యూ సినిమా ఈనెల 29 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. సాయి ధరమ్ సినిమాల విషయంలో అటు మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు సపోర్ట్ అందించేందుకు రెడీ అయ్యారు. ఇకపై ఇద్దరు మామలు మేనల్లుడి సినిమా విషయంలో కేర్ తీసుకునేందుకు సిద్ధం అయ్యారట. తేజకు మంచి హిట్ సినిమా పడేలా చెయ్యాలని నిర్మాత అల్లు అరవింద్ కు ఇద్దరు మామలు చెప్పారట. దాంతో అయన సాయి ధరమ్ కోసం గీత ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments