మేనల్లుడికోసం రంగంలోకి మెగాస్టార్ ?

Saturday, June 2nd, 2018, 11:25:19 AM IST

మెగా మేనల్లుడికోసం మామ మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న తేజ్ ఐలవ్ యు సినిమా పాటల వేడుకకు మెగాస్టార్ ముఖ్య అథితిగా పాల్గొననున్నాడు. ఇందులో మరో కారణం కూడా ఉంది .. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు నిర్మిస్తున్నాడు. కె ఎస్ రామారావు తో చిరంజీవికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఆడియో వేడుకలో పాల్గొంటున్నాడు. ఈ నెల 9 న హైద్రాబాద్ లో జరగనుంది. ఈ మధ్య వరుస ప్లాపులతో టెన్షన్ మీదున్న సాయి ధరమ్ తేజ్ కు మంచి హిట్ కావాలి. కరుణాకరన్ సినిమా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు .. దానికి తోడు మెగాస్టార్ క్రేజ్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుందని ప్లాన్ చేసారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 29 న విడుదల కానుంది.