కొరటాల – మెగాస్టార్ సినిమాకు ముహూర్తం కుదిరిందా ?

Tuesday, July 31st, 2018, 02:50:10 AM IST

ప్రస్తుతం సైరా సినిమాలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసాడు. అయన నెక్స్ట్ సినిమా క్రేజీ దర్శకుడు కొరటాల శివతో ఉంటుంది. ఇటీవలే మహేష్ తో కొరటాల చేసిన భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో కొరటాల జోరుగా తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కొరటాల కోసం వెయిట్ చేస్తుంటే .. అయన మాత్రం తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ తో అని తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రంకోసం కొరటాల అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడట. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతుందట. అయితే మెగాస్టార్ సరసన హీరోయిన్ ఎవరా అన్న విషయం పై అయన టెన్షన్ పడుతున్నదని టాక్. ఇక మెగాస్టార్ కూడా సైరా సినిమా కోసం మరో రెండు నెలలు వర్క్ చేస్తే ఆ షూటింగ్ పూర్తవుతుంది . ఆ తరువాత వెంటనే కొరటాల సినిమాలో జాయిన్ అవుతాడు. సో అన్ని కుదిరితే నవంబర్ లో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందట. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తాడట.

  •  
  •  
  •  
  •  

Comments