మెగాస్టార్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ ?

Tuesday, May 22nd, 2018, 09:37:53 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా ప్రస్తుతం హైద్రాబాద్ లోని రంగస్థలం సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఫిలిం వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దీపావళి లేదా వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ 152వ సినిమా ఎవరితో అన్న విషయం పై క్లారిటీ వచ్చేసింది. అయన నెక్స్ట్ సినిమా కొరటాల శివతో ఉంటుందని మెగా వర్గాల సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివతో చర్చలు జరిపాడని మంచి యాక్షన్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రీసెంట్ గా మహేష్ తో భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివకోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా మెగాస్టార్ తో ప్లాన్ చేయడం విశేషం. ఈ సినిమా దసరా తరువాత పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments