మెగాస్టార్ 152 కన్ఫర్మ్ అయినట్టేగా ?

Sunday, January 28th, 2018, 09:43:40 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151 వ చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. రెండో షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో జరగనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక మెగాస్టార్ అప్పుడే తన 152 వ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సైరా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈ లోగా మరో సినిమాను కూడా ఓకే చేసి షూటింగ్ మొదలు పెట్టాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మెగాస్టార్ 152వ చిత్రాన్ని సుకుమార్ తో చేయడానికి రెడీ అయ్యాడట. ఇప్పటికే లైన్ విన్న చిరు .. స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకురా అని చెప్పడంతో ప్రస్తుతం చరణ్ తో రంగస్థలం చిత్రాన్ని తీసిన సుకుమార్ ఇక నెక్స్ట్ అదే పనిలో ఉండే ఛాన్స్ ఉంది. సో త్వరలోనే ఈ సినిమాకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోలేవు .. !!