ట్విట్ట‌ర్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

Thursday, May 3rd, 2018, 10:25:17 PM IST

న‌వ‌త‌రంకు సైతం సాధ్యం కాని రీతిలో ఎంతో యాక్టివ్‌గా ట్విట్ట‌ర్‌లో జోరు చూపిస్తుంటారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా అలాంటిది. అయితే ట్విట్ట‌ర్‌ని ఎంత‌గానో అభిమానించే బిగ్‌బికి అందులో ఉండే ఫాలోవ‌ర్ల అస్థిర‌త‌తో.. ఉన్న‌ట్టుండి కోపం రావ‌డం.. త‌న అకౌంట్‌ని క్లోజ్ చేసేస్తాన‌ని హెచ్చ‌రించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చంది. బిగ్‌బి అంత‌టివాడే స్ట్రాంగ్ డోస్ ఇవ్వ‌డంతో ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు దిగొచ్చి ఆ స‌మ‌స్య‌ను సాల్వ్ చేశారు. ఆ త‌ర‌వాత ట్విట్ట‌ర్ ప‌నిత‌నంపై అమితాబ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆ ఎపిసోడ్లు అప్ప‌టికి ముగిశాయి అనుకుంటే, ఇప్పుడు మ‌రోసారి ట్విట్ట‌ర్‌పై త‌న‌దైన శైలిలో ట‌చ్‌లోకొచ్చారు అమితాబ్‌. అయితే ఈసారి మాత్రం ట్విట్ట‌ర్‌ని విప‌రీతంగా పొగిడేశారు.

“నా ఫాలోవ‌ర్స్‌ని స్థిరంగా ఉంచ‌డంలో ట్విట్ట‌ర్ మేనేజ్‌మెంట్ కృషి బావుంది“ అంటూ పొగిడేశారు. వెల్ డ‌న్ .. మ్యాగ్జిమం నిలబెట్ట‌గ‌లిగారు.. ఎంత‌కీ క‌ద‌ల‌ని స్కోర్ బోర్డును.. ప‌రుగులెత్తించేలా.. ప్ర‌తి బంతిని సిక్స‌ర్ కొట్టేలా ఎలా మ్యానేజ్ చేయ‌గ‌ల‌రు? అని బిగ్‌బి ప్ర‌శ్నించారు. మెగాస్టార్ ఆనందంగా ఉన్నా.. కోపంగా ఉన్నా ఆ ప్ర‌భావం అవ‌త‌లివారిపై త‌ప్ప‌నిస‌రి అని ఈ రెండు సంద‌ర్భాలు చెబుతున్నాయి క‌దూ?

  •  
  •  
  •  
  •  

Comments