మెగాస్టార్ మీసం అందుకే తీసేసారట!

Sunday, January 14th, 2018, 12:58:22 AM IST

రంజిత్, పాలక్ లల్వాని జంటగా రూపొందిన చిత్రం ‘జువ్వ’. ఎస్ వి రమణ సమర్పణ లో దిక్కులు చూడకు రామయ్య ఫేమ్ త్రికోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి తన చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో చిత్రం లోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉందని, రంజిత్ టీజర్ లో పక్కా మాస్ గా కనిపించాడని, హీరోయిన్ లల్వాని రొమాంటిక్ గా అందంగా ఉందని అన్నారు. ఇందులో నటించిన రంజిత్, మరియు ఈ చిత్ర నిర్మాత భరత్ అన్నదమ్ములని, స్వతహాగా భరత్ డాక్టర్ అని, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అన్న మాట మనం వింటుంటాం, కానీ భరత్ మాత్రం తమ్ముడికోసం డాక్టర్ కాస్త ప్రొడ్యూసర్ అయ్యాడని, ఆ విధంగా ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలబడిందని చెప్పుకొచ్చారు.

రాజమౌళి శిష్యుడయిన త్రికోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వీళ్ళిద్దరికోసం తప్పకుండా చూస్తానని, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హీరో రంజిత్ మాట్లాడుతూ, తనకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అన్నారు. ఒక్కసారైనా ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునేవాడిని, అలాంటిది మెగాస్టార్ తన చిత్రం ఫస్ట్ లుక్ విడుదలచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిర్మాత భరత్ మాట్లాడుతూ, చిత్రం ఫస్టులుక్, టీజర్ విడుదలచేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు, చిత్రం మొత్తం పూర్తిఅయింది. నెలాఖరులో ఆడియోను, ఫిబ్రవరి లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే మెగాస్టార్ మీసం లేకుండా దర్శనమివ్వడంతో కొంతమంది మీడియా మిత్రులు మీసం విషయమై ఆయనని ప్రశ్నించగా, సైరా సినిమా కోసమే తాను మీసం తీసేసినట్లు, ఆ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం ముఖ కవళికల కొలతల కోసం తీసివేయవలసి వచ్చిందని చెప్పారు. ఇదివరకు మెగాస్టార్ చంటబ్బాయి చిత్రంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలలో మీసం లేకుండా కనిపించిన సంగతి మన అందరికి విదితమే.