భారీ రేటుకు మెగాస్టార్ సైరా డిజిటల్ హక్కులు ?

Sunday, March 4th, 2018, 12:22:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదేళ్ల తరువాత ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా తన స్టామినా తగ్గలేదని బాక్స్ ఆఫీస్ వద్ద నిరూపించాడు. బాహుబలి తరువాత రెండో స్థానంలో వసూళ్లతో దుమ్ము రేపాడు మెగాస్టార్. ఇక అయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా సైరా నరసింహ రెడ్డి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల నుండి రెండో షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్పుడే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్, ట్రైలర్స్ , మేకింగ్ వీడియొ, ఫస్ట్ లుక్ లాంటి డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఏకంగా 30 కోట్లకు సొంతం చేసుకుందట. నిజంగా ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో హక్కులు అమ్ముడవ్వడం సైరా సినిమాకు జరగడం విశేషం. మెగాస్టార్ సైరా లో అమెజాన్ సంస్థ భాగస్వామ్యం అవ్వడంతో ఆ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. మొత్తానికి మరోసారి మెగాస్టార్ తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసాడు.. దట్ ఈస్ మెగాస్టార్ అంటూ మెగా ఫాన్స్ తెగ సంబరాలు చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.