సైరా .. సన్నాహాలు జోరందుకున్నాయిగా ?

Sunday, December 3rd, 2017, 03:05:44 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచే సైరా కోసం భారీ సన్నాహాలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్నచిత్రం సైరా నరసింహ రెడ్డి ఈ వారంలో మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో తెలుగులో నటీనటులు కాకుండా ఇతర బాషా ప్రముఖులు నటిస్తున్నారు. ఆగస్టు లో లాంఛనంగా ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 6నుండి మొదలు పెడుతున్నారు. ఇప్పటికే టెస్ట్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకోసం హైద్రాబాద్ లో భారీ సెట్స్ కూడా వేశారు. ఈ నెల 6న హైద్రాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరగనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా కోసం గ్రాండ్ లొకేషన్స్ ని ఎంచుకున్నారు. ఇక ఈ సినిమా కోసం ముందు అనుకున్నట్టుగా సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో యూనిట్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా విషయంలో భారీ హంగామా మొదలు కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments