రెండో అధ్యాయంకోసం మెగా ‘సైరా ‘న్?

Wednesday, February 14th, 2018, 10:43:00 PM IST

తెలుగులో బాహుబలి తరువాత అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్ ని ఈ నెల 23 న మొదలు పెట్టనున్నారట !! ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం రెండో షెడ్యూల్ భారీగా ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నయనతార తో పాటు బిగ్ బి అమితాబ్ కూడా పాల్గొంటున్నాడట. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మూడు భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా నెలరోజుల పాటు జరగనుందట. ఈ సినిమాకోసం సంగీత సంచలనం ఇళయరాజాను రంగంలోకి దింపుతున్నారు.