కీలక షెడ్యూల్ కి సిద్దమైన సైరా ?

Sunday, May 27th, 2018, 02:01:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తీ చేసుకుంది. లేటెస్ట్ గా హైద్రాబాద్ లోని రంగస్థలం సెట్స్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ ని జూన్ 5 నుండి ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లోనే సినిమాకు సంబందించిన పలు ముఖ్యమైన సన్నివేశాలు తీసారట. యాక్షన్ సన్నివేశాలతో పాటు కథలో కీలకంగా నడిచే సీన్స్ కూడా తీయనున్నారట. ఈ షెడ్యూల్ లోనే సినిమాలో నటిస్తున్న ఇతర స్టార్స్ కూడా పాల్గొంటారని టాక్. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు . నయనతార, తమన్నా లాంటి హీరోయిన్స్ తో పాటు అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా దసరాకు విడుదల ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments