షాక్ .. సైరా కోసం షాకిచ్చే లుక్ లో మెగాస్టార్ ?

Monday, December 4th, 2017, 11:47:00 AM IST

సినిమా అంటే ఎంత ప్యాషన్ అన్న విషయాన్ని కొందరు మాటల్లో చెబితే .. మరి కొందరు కష్టంలో చెప్పేస్తారు. ఆయా సినిమాల్లోని పాత్రలకు తీవ్రంగా కష్టపడి .. ఆ పాత్రల్లో మెప్పించే నటీనటులు అరుదు .. తాజాగా అలాంటి మేక్ ఓవర్ తో షాక్ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి? అయన నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా కోసం ప్రత్యేక రూపాన్ని దించుతున్నాడు. 151వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా 6న రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో నరసింహ రెడ్డి పాత్ర కోసం చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడుతున్నాడా .. అటు చరణ్ తో కలిసి చిరంజీవి ఫిట్ నెస్ పై పోటీ పడి స్లిమ్ గా రెడీ అవుతున్నాడు. తాజా గా ఓ ఫోటో బయటికి వచ్చింది .. ఆ ఫోటో చూసినవాళ్లంతా .. బాబోయ్ చిరంజీవి ఏంటి ఇలా తయారయ్యాడు అని అంటున్నారు. ఉయ్యాలావాడ పాత్ర అంటే ఓ పోరాట యోధుడు కాబట్టి .. దానికి తగ్గట్టే ఫిట్ నెస్ గా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేసాడు మెగాస్టార్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహ రెడ్డి ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. 6 నుండి హెదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదలు కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments