షాకిస్తున్న మెగాస్టార్ న్యూ లుక్ ..సైరా కోసమేనా?

Saturday, January 13th, 2018, 12:49:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజా లుక్ అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు ముందు అయన నటిస్తున్న సైరా సినిమాకోసం భారీ గడ్డం లుక్ లో కనిపించిన చిరంజీవి న్యూ ఇయర్ రోజున గడ్డం తీసేసి న్యూ లుక్ లో కనిపించారు. తాజాగా అయన మీసాలు కూడా తీసేసి స్లిమ్ అవతారంలో కనిపించడం అందరికి షాక్ ఇచ్చింది. ఈ లెక్కన చిరంజీవి నటిస్తున్న సైరా కోసమే ఈ లుక్ మార్చాడా అన్న ఆసక్తి ఎక్కువైంది. ఇక మెగాస్టార్ నటిస్తున్న సైరా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. రెండో షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో మొదలవుతుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్ లు నటిస్తున్నారు.