అన్నిటికీ మావ‌య్యేనా మెగా అల్లుడా?

Wednesday, July 11th, 2018, 02:54:47 PM IST

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ న‌టించిన `విజేత` ఈనెల 12న‌ రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగా అల్లుడు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం న‌గ‌రంలో వెల‌సిన హోర్డింగులు, పోస్ట‌ర్లు చూసి ఎంతో ఇదైపోతున్నాడ‌ట‌. రిలీజ్ వేళ పాత్రికేయుల‌తో మాట్లాడిన క‌ళ్యాణ్ దేవ్ ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తులే చెప్పాడు. ద‌ర్శ‌కుడు రాకేష్ వినిపించిన లైన్‌ని తొలుత మావ‌య్య‌ చిరంజీవి గారు విని ఓకే చెప్పారు. అటుపై క‌థ రెడీ అయ్యాక దానిపై త‌న స‌ల‌హాలిచ్చారు. నేను కేవ‌లం వారు ఏం చెబితే అది చేశానంతే. అన్నీ మావ‌య్యే చూసుకున్నారు. ఆన్ లొకేష‌న్ వెళ్లాక అక్క‌డ చిత్ర‌యూనిట్ అంతా స్నేహితుల‌య్యారు. నా ద‌ర్శ‌కుడు రాకేశ్ శశి, కెమెరా డిపార్ట్‌మెంట్, నిర్మాత‌లు అంతా స్నేహంగా ఉండ‌డం వ‌ల్ల న‌టించ‌డం సులువైంది.

ఇక మెగా హీరోలు అంత‌మంది ఉన్నారు.. మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చాను అన్న ఒత్తిడి నాపై అస్స‌లు లేనేలేదు. అంతా ప్లెజ‌ర్‌గానే సాగిపోయింది. బిజినెస్ నుంచి సినిమాల్లోకి వ‌చ్చానంటే ఆ వెన‌క బోలెడంత ఆస‌క్తి ఉంది. చిన్న‌ప్ప‌టినుంచి క‌ళ‌లు అంటే చాలా ఇష్టం. నేను స్టేజీ పెర్ఫామెన్సెస్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా స్కూల్‌లో ఓ అవార్డును అందుకున్నాను.. అని మురిపెంగా చెప్పాడు క‌ళ్యాణ్‌. మావ‌య్య న‌టించిన సినిమా విజేత టైటిల్ నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతుంద‌ని భ‌య‌ప‌డినా క‌థ డిమాండ్ మేర‌కు చివ‌రికి అదే ఫైన‌ల్ చేశారు. రేపు రిలీజ్ అన‌గా ఇవాళ పోస్ట‌ర్లు, హోర్డింగులు చూసుకుంటే ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అంద‌రూ ఆశిస్తార‌నే భావిస్తున్నా… అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments