చరణ్ .. మెగా గిఫ్ట్ అదిరిందబ్బా ?

Tuesday, March 27th, 2018, 12:59:51 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మంగళ వారం అయితే ఒకరోజూ ముందుగానే మెగాస్టార్ తన తనయుడు చరణ్ కు ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చేసాడు. ఇంతకీ చిరంజీవి ఏమి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా .. సూపర్ వాచ్. తన కుమారుడికి అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి మెగాస్టార్ చిరంజీవి తల్లి సురేఖ ఇచ్చిన గిఫ్ట్ తాలూకు ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చరణ్ గిఫ్ట్ చుసిన ప్రతి ఒక్కరు మెగా గిఫ్ట్ అదిరిందబ్బా అని పొగిడేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ తన కొడుక్కు అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చేసి తండ్రి ప్రేమను చాటుకున్నాడు. ఈ గిఫ్ట్ తీసుకున్న చరణ్ కూడా థాంక్స్ డాడ్ అండ్ మామ్ అంటూ వాళ్లకు థాంక్స్ తెలిపాడు.