మెగా సైరా కు సైరన్ మోగనుంది ?

Tuesday, October 24th, 2017, 02:21:39 PM IST

బాహుబలి తరువాత ఆ రేంజ్ లో తెలుగులో తెరకెక్క నున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే నటీనటులు, టెక్నీషయన్స్ తో పాటు ఓ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు .. అయితే ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. దాంతో మరో డేట్ ని ఫిక్స్ చేశారట !! ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత చరణ్ అమెరికాలో గ్రాఫిక్ నిపుణులతో చర్చలు కూడా జరిపారు, అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టి కంటిన్యూ గా షూటింగ్ చేయాలనీ ప్లాన్ చేశారట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నాడు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తారట. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.