ఫ్లాష్ ఫ్లాష్‌ : `సైరా` త‌ర‌వాత‌ మెగాస్టార్ `భైర‌వ‌`

Saturday, May 12th, 2018, 12:28:54 PM IST

మెగాస్టార్ చిరంజీవి-వైజ‌యంతి మూవీస్ కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి `మ‌హాన‌టి` ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఈ సినిమా క‌థాంశం `పాతాళ భైర‌వి` త‌ర‌హాలో ఉంటుంద‌ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. `మ‌హాన‌టి` సినిమాపై త‌న రివ్యూ చెప్పిన మెగాస్టార్ ఈ విజ‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సేమ్ టైమ్ నాగ్ అశ్విన్ – అశ్వ‌నిద‌త్‌తో త‌న ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్‌ని అందించారు.

ఎట్ట‌కేల‌కు `జ‌గ‌దేక‌వీరుడు-అతిలోక సుంద‌రి` కుద‌ర‌క‌పోయినా వైజ‌యంతి మూవీస్‌లో `భైర‌వ‌`కు స‌న్నాహకాలు సాగుతున్నాయ‌న్న వార్త‌తో మెగాభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా నాగ్ అశ్విన్ కెరీర్‌కి పెద్ద బూస్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఈ సినిమా మెగాస్టార్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న `సైరా- న‌రసింహారెడ్డి` త‌ర‌వాత వెంట‌నే ఉంటుందా? లేక చిరు-బోయ‌పాటి సినిమా త‌ర‌వాత ఉంటుందా? అన్న‌ది వెల్ల‌డి కావాల్సి ఉందింకా. మెగాస్టార్ రెండేళ్ల క్రిత‌మే అవ‌కాశం ఇచ్చినా స‌రైన క‌థ కుద‌ర‌క వైజ‌యంతి సంస్థ వేచి చూడాల్సొచ్చింది. ఇక నాగ్ అశ్విన్ స‌ద‌రు బ్యాన‌ర్ లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌బోతున్నార‌ని తాజా గా మెగాస్టార్ ప్ర‌క‌ట‌న‌తో అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments