మేఘా ఆకాష్ ఈ సారైనా హిట్టిస్తుందా..? మళ్ళీ ఫట్టేనా..

Wednesday, April 4th, 2018, 05:58:33 PM IST

మేఘా ఆకాష్.. లై సినిమాతో నితిన్ సరసన తెలుగు ప్రేక్షకుల ముందుకు దర్శనమిచ్చిన ఈ అందాల నటి మొదటి సినిమాతోనే డిసాస్టర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. నటన విషయంలో కాస్త పై అంజేలోనే ఉన్నా కూడా, దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన లై సినిమాలో నితిన్ సరసన నటించి భారీ డిసాస్టర్ తో ఫ్లాపయ్యింది. ఇప్పుడు చల్ మోహన రంగ సినిమాతో మళ్ళీ నితిన్ తోనే యాక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ ఈసారైనా హిట్టై ముందుకు పోతుందో లేక ఫట్టై వెనక్కి వస్తుందో చూడాలి అన్నట్టుగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఏదేమయినా త్రివిక్రమ్ కథ, పవన్ కళ్యాణ్ ల బ్యానర్ మీద వస్తున్న ఈ సినిమా పై కొంతవరకు ప్రేక్షకులకు నమ్మకంగానే ఉన్నా తాజాగా త్రివిక్రమ్ పవన్ ల అజ్ఞాతవాసి ఫ్లాపయినందున కొంచం భయం భయంగానే ఉన్నారు. అయితే రేపు రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా నితిన్ కి మేఘాకి ఈ సారైనా హిట్టు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

  •  
  •  
  •  
  •  

Comments