‘అత్తారింటికి దారేది’ రీమేక్ లో మేఘా ఆకాశ్

Tuesday, September 4th, 2018, 02:58:42 PM IST

ప్రస్తుత రోజుల్లో సినిమాల్లో అవకాశాలు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. దానితో పాటు నటనతో మెప్పించే ఆకర్షణ ఉండాలి. హీరోయిన్స్ అయితే ఎక్కువగా అందంతో ఆకట్టుకోవాలి. ఆ తరువాత హిట్స్ వచ్చాయి అంటే చాలు ఇక ఓ రేంజ్ లో బిజీ అయిపోతారు. అయితే ప్లాప్ వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు. లై సినిమాతో గత ఏడాది టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మేఘ ఆకాష్. చూడగానే తన నవ్వుతో కుర్రకారు మనస్సు దోచుకున్న ఈ బ్యూటీ అనుకున్నంత రేంజ్ లో హిట్టు అందుకోలేదు.

ఇక రెండవ సినిమా ఛల్ మోహన్ రంగ కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో అమ్మడిని తెలుగులో ఎవరు పట్టించుకోలేదు. ఇక లాభం లేదని తమిళ్ లో ట్రై చేయగానే అధర్వతో ఒక అవకాశం దక్కింది. ఇక అదృష్టం బావుండి మరో మంచి కథలో అవకాశం దక్కించుకుందట. తెలుగు పవన్ కళ్యాణ్ కు బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిన అత్తారింటికి దారేది సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో మేఘ ఆకాష్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ అవకాశంతో అయినా ఈ బ్యూటీ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments