మెహబూబా జిందాబాద్..ట్రైలర్ రిలీజ్

Monday, April 9th, 2018, 06:35:24 PM IST

బయట హీరోలతోనే కాదు నా కొడుకుని కూడా హీరోను చేస్తానంటూ, ఎన్నో రోజులుగా కష్టపడి చివరికి ఈ రోజుకు మన ముందుకు వచ్చేసాడు పూరీ జగన్నాథ్ సన్. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ, నేహా శెట్టి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం మెహబూబా. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం రూపొందింది. హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో మూవీ షూటింగ్ జరిపారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, మే 11 న చిత్రాన్ని విడుదల చేయడానికి సర్వత్రా సిద్దం చేసారు.

ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా పూరీ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ కొద్ది సేపటి క్రితం యూ ట్యూబ్ లో విడుదలైంది. ట్రైలర్ లో పూరీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుండే తండ్రి సారథ్యంలో సినిమాలు చేయడం వలన ఆకాశ్ నటనలో ఈ సారి మరింత వైవిధ్యం కనిపిస్తుంది. అద్బుతమైన సన్నివేశాలతో సినీ లవర్స్ లో మరింత ఆసక్తి కలిగించారు మేకర్స్ . సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తిని కలిగించాయి. లవ్ వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ కన్నేయండి.