టీజర్ : పూరి మెహబూబా వార్

Friday, February 9th, 2018, 01:25:26 PM IST

కమర్షియల్ యాంగిల్ లో హీరో క్యారెక్టర్ చూట్టు సినిమాను అద్భుతంగా తెరకెక్కించగలిగే పూరి జగన్నాథ్ మొదటి సారి స్టైల్ ని వదలి సరికొత్త కథతో రాబోతున్నాడు. అదే మెహబూబా. తన కుమురుడు ఆకాష్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతోన్న ఆ లవ్ స్టోరీ ఇండో – పాక్ వార్ నేపథ్యంలో సాగుతుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో సాగె ఒక లవ్ స్టోరీని పూరి అద్భుతంగా తెరకెక్కించడానికి తెలుస్తోంది. రీసెంట్ గా అందుకు సంబందించిన టీజర్ ని కూడా పూరి రిలీజ్ చేశాడు. చూస్తుంటే పూరి కొంచెం హై బడ్జెట్ తో సినిమాను నిర్మించాడు అనిపిస్తోంది. పాక్ సైనికులు ఇండియా సైనికుల మధ్య బార్డర్ యుద్ధంలో పాక్ ముస్లిం అమ్మాయిని సైనికుడు ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా అసలు కథాంశం. టీజర్ కి మంచి స్పందన వస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.