మెహ్రీన్‌లో నైరాశ్యం అలా త‌న్నుకొచ్చింది!

Wednesday, April 4th, 2018, 11:26:34 PM IST

`రాజా ది గ్రేట్‌`, `మ‌హానుభావుడు` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు, `కేరాఫ్ సూర్య‌`, `జ‌వాన్‌` వంటి అట్ట‌ర్‌ఫ్లాప్‌లు త‌న కెరీర్‌లో ఉన్నాయి. అయితే హిట్లు సంతోష పెట్టిన దానికంటే, ఫ్లాప్‌లు వేదించిందే ఎక్కువ అని భావిస్తున్న‌ట్టుంది అందాల క‌థానాయిక మెహ్రీన్‌. ఉన్న‌ట్టుండి ఊహించ‌ని రీతిలో క‌విత్వం చెప్పింది. ఈ క‌విత్వం అంతా నైరాశ్య‌మే క‌నిపించింది.

వినేందుకు ఎంతో పోయెటిక్‌గా, దిశానిర్ధేశ‌నం చేస్తున్న‌ట్టు అనిపిస్తున్న ఈ క‌విత్వం వెన‌క వేరొక కోణం బ‌య‌ట‌ప‌డింది. “న‌మ్మండి.. మిమ్మ‌ల్ని మీరు బాగా న‌మ్ముకోండి.. న‌మ్మ‌కం చాలా చాలా ముఖ్యం. క‌ల‌లు క‌నండి.. క‌ల‌ల్లో జీవించండి.. ఆ త‌ర‌వాత వాటిని త‌ప్ప‌క సాధించుకోండి.. సాగండి ముందుకు అలానే సాగండి.. సాధించుకోండి“ అంటూ పోయెట్రీతో పెట్రేగిపోయింది. ఓట‌మికి త‌ల‌వొంచొద్దు.. చివ‌రి వ‌ర‌కూ పోరాడండి అని సూచించింది. ఒక‌ట్రెండు ఫ్లాపుల‌కే ఇలా అయితే ఎలా మెహ్రీన్‌? అంటూ యూత్ లో ఒక‌టే గుసగుస‌లు.

  •  
  •  
  •  
  •  

Comments