శ్రీయ‌భూపాల్ పెళ్లిలో చ‌ర‌ణోపాస‌న‌

Tuesday, May 29th, 2018, 01:48:02 PM IST

సెల‌బ్ వెడ్డింగ్స్ అన్నీ సీక్రెట్‌గానే జ‌రుగుతుంటాయి. ఎలాంటి అన‌వ‌స‌ర హంగామా లేకుండా ఇటీవ‌లి కాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో విదేశాల‌కు వెళ్లి హాయిగా చేసుకుంటున్నారు. దీనివ‌ల్ల లోక‌ల్ మీడియా అన‌వ‌స‌ర హంగామాను ఫేస్ చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌డం లేదు. తాజాగా ఓ పెళ్లి అలానే జ‌ర‌గ‌డం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఈ వివాహంలో రామ్‌చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట ఓ రేంజులో సంద‌డి చేశారు. అస‌లింత‌కీ ఈ పెళ్లి ఎవ‌రిది? ఎక్క‌డ జ‌రిగింది? అని ప్ర‌శ్నిస్తే.. ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. టాలీవుడ్‌లో చీమ‌కు సైతం తెలీకుండా జ‌రిగిన ఈ పెళ్లి హంస‌న‌డ‌క‌ల ఫ్యాష‌న్ ప్ర‌పంచం ప్యారిస్‌లో జ‌రిగింది. ఫ్రాన్స్ రాజ‌ధాని ప్యారిస్‌కి 50 కి.మీల దూరంలో ఈ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ ఓ భారీ జ‌మీందారీ భ‌వంతిలో జ‌రిగింది. ఈ వేడుక‌కు చ‌ర‌ణ్‌- ఉపాస‌న ముఖ్య అతిధులుగా హాజ‌రై వ‌ధూవ‌రుల్ని ఆశీర్వదించారు. ఈ వెడ్డింగ్ ఫోటోలు.. ఏవీ లీక్ కాలేదు కానీ.. ఉపాస‌న స్వ‌యంగా కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. `మిస్ట‌ర్‌సితో మ‌ధుర‌జ్ఞాపకాలు` అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. అస‌లింత‌కీ ఈ పెళ్లి ఎవ‌రిది? అంటే అఖిల్ మాజీ ప్రేయ‌సి శ్రీయాభూపాల్ పెళ్లి అని ఫోటోల్ని బ‌ట్టి తెలిసింది. శ్రీయ పెళ్లాడింది ఉపాస‌న క‌జిన్‌ని. అందుకే ఈ వివాహ మ‌హోత్స‌వంలో ఉపాస‌నాస‌మేతుడై చ‌ర‌ణ్ ప్ర‌ధాన అతిధిగా సంద‌డి చేశారు. అదీ సంగ‌తి.

  •  
  •  
  •  
  •  

Comments