ప్ర‌భుదేవా మూకీ మూవీ అంత‌ర్జాతీయ ఫిలింఫెస్ట్‌లో!?

Friday, March 30th, 2018, 11:08:05 PM IST

`పుష్ప‌క విమానం` త‌ర‌వాత మూకీ సినిమాల ప్ర‌యోగంపై జ‌నాల‌కు పెద్దంత‌గా అవ‌గాహ‌నే లేదు. మూకీ అంటే సింగీతం సినిమా పేరు మాత్ర‌మే గుర్తొస్తుంది. అయితే తాజాగా ప్ర‌భుదేవా క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బ‌రాజు చేస్తున్న మూకీ ప్ర‌యోగం `మెర్క్యురి` పేరు వ‌ర‌ల్డ్ వైడ్ మార్మోగిపోతోంది.

ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ లాస్ ఏంజెల్స్(ఐఎఫ్ఎఫ్ ఎల్ఏ) వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఏప్రిల్ 12న సినిమా పండుగ‌లో ప్ర‌ద‌ర్శించి, ఆ మ‌రునాడే అంటే ఏప్రిల్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ త‌ర‌హాలో ఓ సినిమా పండుగ‌లో ప్రివ్యూ వేస్తూ, ఆ త‌ర‌వాతి రోజు రిలీజైన వేరొక భార‌తీయ సినిమానే లేదుట‌.