చరణ్ తో సినిమా చేస్తానంటున్న నాని దర్శకుడు ?

Saturday, April 21st, 2018, 04:14:48 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తానని అంటున్నాడు కుర్ర దర్శకుడు మేర్లపాక గాంధీ. తాజాగా ఈయన తెరకెక్కించిన కృష్ణార్జున యుద్ధం సినిమా డివైడ్ టాక్ తో రన్ అవుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని కి ఈ సినిమా బ్రేక్ వేసిందని చెప్పాలి. ఇక మేర్లపాక గాంధీ నిజానికి కృష్ణార్జున యుద్ధం కథను మొదట చరణ్ కె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వేరే సినిమాల కమిట్మెంట్ వాళ్ళ చరణ్ ఆ సినిమా చేయనన్నాడని టాక్. అయితే గాంధీ ఓ ఇంటర్వ్యూ లో స్పందిస్తూ చరణ్ తో నాకు అత్యంత సాన్నిహిత్యం ఉందని, తనంటే నాకు ఇస్తామని .. తనతో తప్పకుండా సినిమా చేస్తానని అంటున్నాడు. అయితే చరణ్ కు వినిపించిన కథ విషయంలో చరణ్ నో చెప్పలేదని. దానిని పోస్ట్ పోనే చేసినట్టు చెప్పాడు. సో కృష్ణార్జున రిజల్ట్ తో చరణ్ అవకాశం ఇస్తాడా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments