35కోట్ల వ్యూస్ .. ద‌టీజ్ ఇల‌య‌ద‌ళ‌ప‌తి!

Thursday, September 20th, 2018, 02:52:05 PM IST

యూట్యూబ్ వ్యూస్ ప్రామాణికంగా మారిన రోజులివి. ఇటీవ‌ల ఫ్యాన్ ఫాలోయింగ్‌కి యూట్యూబ్‌, సామాజిక మాధ్య‌మాలే సింబాలిక్‌గా మారాయి. ఆన్‌లైన్‌లో దూసుకెళ్ల‌డాన్ని బ‌ట్టి ఒక్కో హీరోకి ఎంత బ‌లం ఉందో డిసైడ్ అవ్వాల్సి వ‌స్తోంది. రీసెంటుగా కొత్త సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కోట్లాది వ్యూస్‌తో దూసుకెళుతూ స్టార్ల‌కు ఉన్న బ‌లాన్ని తెలియ‌జేస్తున్నాయి. ఇటీవ‌ల‌ ర‌జ‌నీ- శంక‌ర్‌ల `2.ఓ` టీజ‌ర్ యూట్యూబ్‌లో రిలీజైన కొన్ని గంట‌ల్లోనే రికార్డ్ వ్యూస్‌తో సంచ‌ల‌నం సృష్టించింది. మెగాస్టార్ `సైరా` ఫస్ట్‌లుక్ టీజ‌ర్‌కి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది.

తాజాగా త‌మిళ స్టార్ హీరో, ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ యూట్యూబ్‌లో సాధించిన ఓ అరుదైన రికార్డు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. విజ‌య్ మెర్స‌ల్ ఆల్బ‌మ్ యూట్యూబ్‌లో రికార్డులు బ‌ద్ధ‌లు కొడుతోంది. అంత‌ర్జాలంలో 35 కోట్ల (350 మిలియ‌న్) వ్యూస్‌తో మెర్స‌ల్ పాట‌లు రికార్డ్ సృష్టించాయి. కేవ‌లం నాలుగే నాలుగు పాట‌లు ఉన్న ఆల్బ‌మ్ ఇంతటి ఆద‌ర‌ణ‌కు నోచుకోవ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇది ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్ ప‌వ‌ర్ అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సోనికి ప్రౌడ్ మూవ్‌మెంట్ ఇది “ప్రౌడ్ .. ప్రౌడ‌ర్.. ప్రౌడెస్ట్‌!“ అంటూ సోని మ్యూజిక్ సెల‌బ్రేట్ చేస్తోంది. 350 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకున్న‌ తొలి త‌మిళ ఆల్బ‌మ్ `మెర్స‌ల్` అంటూ ఆ ఆనందాన్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసుకుంది. ఈ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించి `ఆల‌పోరాన్ త‌మిజ‌న్‌` పేరుతో ఓ వెర్టిక‌ల్ వీడియోని సోని లాంచ్ చేసింది. ఈ వీడియో ఇల‌య‌ద‌ళ‌ప‌తి అభిమానుల్ని అల‌రిస్తోంది.