మోడీపై దిమ్మతిరిగే పంచ్ వేసిన స్టార్ హీరో..బీజేపీలో ప్రకంపనలు..!

Saturday, October 21st, 2017, 02:26:03 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మెర్సల్ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకునిపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లని కొల్లగొడుతున్న ఈ చిత్రంలోని వివాదభరితమైన డైలాగ్ జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దీనితో ఈ చిత్రం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. మోడీ ప్రభుత్వం అమలు చేసిన దేశమంతా ఒకే వస్తు సేవల పన్ను జీఎస్టీ పై విజయ్ సెటైర్లు సంధించారు. ఈ చిత్రంలో విజయ్ ని పోలీస్ లు అరెస్టు చేసే సన్నివేశం ఉంటుంది. ఈ సందర్భంగా విజయ్ చెప్పిన డైలాగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే..7 శాతం మాత్రమే జీఎస్టీ పన్ను విధిస్తున్న సింగపూర్ దేశంలో వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. కానీ మనదేశంలో 28 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారు. కానీ వైద్యం మాత్రం ఉచితంగా అందించడం లేదు.. ఎందుకు ? విజయ్ సంధించి ఈ ప్రశ్న బిజెపి వర్గాలకు మింగుడు పడడం లేదు. విజయ్ చెప్పిన డైలాగ్ మోడీ స్థాయిని తగ్గించే విధంగా ఉందని బిజెపి నేతలు అంటున్నారు. ఇలాంటి సన్నివేశాల వలన మోడీ భావజాలాల్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకుని వెళుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆలాంటి సన్నివేశాల్ని మెర్సల్ చిత్రం నుంచి తొలగించాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జల్లి కట్టు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments