`మెర్స‌ల్‌` ట్రైల‌ర్ రికార్డులే రికార్డులు

Saturday, September 23rd, 2017, 09:15:33 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, త‌ళా అజిత్ త‌ర్వాత ఆ రేంజులో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌. న‌వ‌త‌రంలో క్రేజీ హీరోగా వెలిగిపోతున్నాడు. విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం మెర్స‌ల్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. రాజా రాణీ ఫేం అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. విజ‌య్ కెరీర్ వందో సినిమాగా ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. లేటెస్ట్‌గా మెర్స‌ల్ ట్రైల‌ర్ రిలీజై యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల్ని చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించింది.

మెర్స‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 1 కోటి 30 ల‌క్ష‌ల వ్యూస్ సాధించి ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ ట్రైల‌ర్‌గా రికార్డుల‌కెక్కింది. 24 గంట‌ల్లోనే 7 ల‌క్ష‌ల 64 వేల లైక్‌లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ లు నెల‌కొల్పింది. క్రేజీ మాస్ మీరో త‌ళా అజిత్ `వివేగం` ట్రైల‌ర్‌ రికార్డుల్ని మెర్స‌ల్ ట్రైల‌ర్ కేవ‌లం 9 గంట‌ల్లో స‌వ‌రించింద‌ని చెబుతున్నారు. ఈ రికార్డులు చూస్తుంటే 100వ సినిమాతో విజ‌య్ అసాధార‌ణ రికార్డులు అందుకుంటాడ‌న్న అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. ట్రైల‌ర్‌లో విజ‌య్ మెస్మ‌రైజింగ్ పెర్ఫామెన్స్ అభిమానుల్ని ప‌దే ప‌దే క‌ట్టిప‌డేస్తోంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments