పాలిట్రిక్స్‌ : అగ్ర హీరోపై మీటూ కుట్ర‌?!

Thursday, October 25th, 2018, 12:53:44 PM IST

ప్ర‌స్తుతం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని మీటూ- ఇండియా ఉద్య‌మం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. సౌత్ ఇండ‌స్ట్రీస్‌లోనూ అడ‌పాద‌డ‌పా ఇలాంటి ఘ‌ట‌న‌లు తెర‌పైకొస్తున్నాయి. అయితే ఎప్పుడో ప‌ది-ప‌దిహేనేళ్ల‌ క్రితం జ‌రిగిన వాటిని ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి తెస్తున్న క‌థానాయిక‌ల‌పైనా రివ‌ర్స్ మీటూ ఉద్య‌మం మొద‌లైంది. ఇన్నాళ్ల త‌ర్వాత మాన్‌స్ట‌ర్స్‌, దుర్మార్గులు, దుష్టులు అంటూ నిందిస్తూ, త‌మ వ్య‌క్తిగ‌త పాపులారిటీని పెంచుకునే య‌త్నం చేస్తున్నారంటూ ప‌లువురు క‌థానాయిక‌ల‌పై రివ‌ర్స్ చీవాట్లు త‌ప్ప‌డం లేదు. గాయ‌ని చిన్మ‌యిపై ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ సోద‌రి రెహానా విరుచుప‌డిన తీరు చూశాక మీటూలో రెండో కోణం బ‌య‌ట‌ప‌డింది. స‌మ‌స్య‌ను మొగ్గ‌లోనే తుంచేయ‌కుండా ఇన్నాళ్ల త‌ర్వాత బ‌య‌ట‌కు రావ‌డం వెన‌క ఇంకే కోణం దాగి ఉంది? అంటూ పెద్ద పెద్ద‌వాళ్లు కొత్త ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తారు.

అదంతా అటుంచితే.. టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్ర క‌థానాయ‌కుడు, ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌నాలు రేపుతున్న ఓ హీరోపై దారుణ‌మైన కుట్ర జ‌రిగింద‌ని తెలుస్తోంది. మీటూ పేరుతో అత‌డిపైకి ఓ అగ్ర‌క‌థానాయిక‌ను ఉసిగొల్పేందుకు కొన్ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌య‌త్నించాయిట‌. అంతేకాదు.. స‌ద‌రు అగ్ర‌క‌థానాయిక‌తో ఈ త‌ర‌హా డీల్ ఒక‌టి కుదుర్చుకునేందుకు భారీగా డ‌బ్బును ముట్ట‌జెప్పాల‌ని ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్ సంభాష‌ణ‌ల ప్ర‌కారం.. ఈ వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. ఇదేదో అతి పెద్ద రాజ‌కీయ కుట్ర అని విశ్లేషిస్తున్నారు. స‌ద‌రు హీరో కం నాయ‌కుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా అధికార‌, ప్ర‌తిప‌క్షాల్ని కిందికి తొక్కేసేంత పెద్ద‌గా ఎదుగుతున్నాడు. జ‌నంలోకి దుందుడుకుగా దూసుకుపోతున్నాడు. ఇది త‌మ‌కు పెను ప్ర‌మాదంగా మారింద‌ని త‌ల‌పోస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే స‌ద‌రు హీరో స‌ర‌స‌న న‌టించిన ఓ అగ్ర క‌థానాయిక‌తో బేరం పెట్టార‌ట‌. ఆ హీరోయిన్ న‌టించిన రీసెంట్ రిలీజ్‌డ్‌ మూవీ వ‌సూళ్లు ఎంతో అంత‌కు డ‌బుల్ ఇస్తామ‌ని, ఓ ప్ర‌ఖ్యాత టీవీ చాట్ షోలో లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేయాల‌ని, మ‌భ్య ప‌ట్టేందుకు ప్ర‌య‌త్నించారట‌. అయితే ఆ హీరోయిన్ ఆ డీల్‌కి అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల్లో అంత పెద్ద స్థాయికి ఎదిగేస్తున్న స‌ద‌రు హీరోపై ఫిర్యాదు చేస్తే ఇక తాను ఐపు లేకుండా పోతాన‌ని స‌ద‌రు క‌థానాయిక బ‌య‌ప‌డిందిట‌. అంతేకాదు.. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగానూ ఇలాంటి దుర్మార్గం ఇష్టం ఉండ‌ద‌ని తెలుస్తోంది. స‌ద‌రు అగ్ర‌క‌థానాయ‌కుడిని వీలున్న మార్గాల్లో డీఫేమ్ చేసేందుకు ప్ర‌త్య‌ర్థులు ఎప్ప‌టిక‌ప్పుడు కుట్ర ప‌న్నుతూనే ఉన్నారు. అత‌డు స‌చ్ఛీలుడు కాడు. మ‌హిళా లోలుడు అని నిరూపించేందుకు ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎల్లో మీడియా నిరంత‌రం నానా తంటాలు ప‌డుతూనే ఉంది. అత‌డిపై ప్ర‌తిసారీ ఏదో ఒక బుర‌ద‌జ‌ల్ల‌నిదే నిదురించ‌ని వైనం క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఆ అగ్ర‌హీరో ఎవ‌రో.. ఆ దుర్మార్గ‌పు పొలిటీషియ‌న్స్ ఎవ‌రో మీరే క‌నిపెట్టండి.

  •  
  •  
  •  
  •  

Comments