వైరల్ వీడియో: మెట్రో మైకేల్ జాక్సన్.. స్టెప్స్ అదరగొట్టాడుగా..!

Tuesday, June 11th, 2019, 11:02:52 AM IST

ప్రముఖ పాప్ సింగర్, డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్‌గా ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించుకున్నది ఎవరంటే మైకేల్ జాక్సన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పాటలు, డ్యాన్స్‌లో ఆయన వేసే స్టెప్పులు అందరిని మైమరిపింప చేస్తుంటాయి. అయితే ఈయన ప్రస్తుతం మన కళ్ళ ముందు లేకపోయినా ఆయన పాటలు విన్నప్పుడు, ఆయనలాగా ఎవరైనా స్టెప్పులు వేస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ మన కళ్ళ ముందే తిరుగుతున్నంత ఫీలింగ్ కనిపిస్తుంది.

అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అంటారు. ఇది చూస్తుంటే ఇప్పుడు నిజమనే భావన ఏర్పడుతుంది. అది ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ మెట్రో రైల్‌లో పనిచేసే ఒక కార్మికుడు భోజన విరామ సమయంలో కాసేపు తనతోటి వర్కర్లతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే అతను కర్రతో చేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరి మతిని పోగొడుతుంది. కర్రతో సాహసాలు చేస్తూ మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేయడం చూస్తుంటే నిజంగా మైకేల్ జాక్సనే దిగి వచ్చడు అన్నట్టుగా కనిపించింది. అయితే అతని డ్యాన్స్ వీడియోను మెట్రో రైల్ ఎండీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ నిజంగా ఇంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి మా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండడం మాకు గర్వకారణమని అన్నాడు. అయితే ఈ వీడియోను చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సూపర్ టాలెంట్ అంటూ రీ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా నిజంగా మైకేల్ జాక్సన్ దిగివచ్చాడు అనడం మాత్రం గ్యారంటీ.