వేలానికి ‘పాప్ కింగ్’ వస్తువులు

Sunday, September 14th, 2014, 12:20:05 PM IST


పాప్ సామ్రాజ్యానికి రారాజుగా వెలిగిన మైకేల్ జాక్సన్ వాడిన వస్తువులను వేలం వేయనున్నారు.మైకేల్ జాక్సన్ కు చెందిన స్మారక వస్తువులతోపాటు ఆయన వాడిన సాక్స్, అండర్ వియర్, ఫోటో ఆల్బమ్, జాక్సన్ పెంపుడు జంతువు చింపాంజీ ధరిచిన జాకెట్, మైకేల్ జాక్సన్ కు చెందిన టేపులు తదితర వస్తువులను ఆన్ లైన్ లో వేలం వేయనున్నారు. గాట్టా హావ్ ఇట్ కలెక్టిబుల్స్ అనే సంస్థ వేలం వేయనున్నది. ఈనెల 19వరకు వీటిని వేలంలో ఉంచుతామని ఆ సంస్థ పేర్కొంది.