తెలుగు సినిమా హీరోలకి మోడీ ఇచ్చిన భారీ షాక్ :

Thursday, November 10th, 2016, 10:51:29 AM IST

modi
బ్లాక్ మనీ మీది యుద్ధం అని నరేంద్ర మోడీ అందరి గుండెల్లో బాంబులు పేల్చేశారు. సినిమా పరిశ్రమ సైతం ఒక్కసారిగా ఈ నిర్ణయం తో ఉలిక్కి పడింది. కలక్షన్ ల దగ్గర నుంచీ సినిమా షూటింగ్ ల వరకూ అంతా బ్లాక్ లో నడుస్తూ ఉంటుంది ఏ పరిశ్రమ అయినా. కాలీవుడ్ – టాలీవుడ్ లాంటి చోట్ల కార్పరేట్ సెక్టార్ రాకపోవడం అంతా వైట్ లో ఇవ్వడానికి తేసుకొవడానికీ ఇష్టపడకపోవడం లాంటి వ్యవహారాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య అయితే.. ఫ్యూచర్ లో ఇంకో పెద్ద ప్రాబ్లెం ఎదురు కానుంది. అది ఇండస్ట్రీకి మంచి చేసేది కాగా.. స్టార్లకు మాత్రం పెద్ద పంచ్ పడే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. స్టార్ డైరెక్టర్లు 10కోట్లు దాటిపోయారు. బాలీవుడ్ లో 40-50 కోట్లు వసూలు చేసే హీరోలు కూడా ఉన్నారు. అయితే.. ఇవన్నీ పైకి చెప్పే ఫిగర్స్ మాత్రమే. ఇదంతా అగ్రిమెంట్స్ లో కానీ.. వైట్ చెల్లింపులు కానీ సాధారణంగా ఉండవు. ముందు మాటల్లోనే ఎంత బ్లాక్.. ఎంత వైట్ అనే సంగతి కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో.. బ్లాక్ మనీ ఇచ్చే ఛాన్స్ నిర్మాతలకు ఉన్నా.. తీసుకునే అవకాశం స్టార్లకు లేదు.