మిల్కీ బ్యూటీ అస‌లు ఊహించ‌లేదిలా!

Wednesday, September 12th, 2018, 07:16:19 PM IST

మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా పై బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత బోలెడ‌న్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. త‌మ‌న్నా ఫేడ‌వుట్ అయిపోయింది. ఇక సినిమాలు రావు. బాహ‌బ‌లిలో అప్ర‌ధాన పాత్ర‌తో ఇక కెరీర్ అయిపోయిన‌ట్టే అంటూ విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. కానీ ఊహించ‌ని రీతిలో మిల్కీ తిరిగి త‌న కెరీర్‌ని ప‌ట్టాలెక్కించింది. ఇప్ప‌టికిప్పుడు 2018-19 సీజ‌న్ ప‌రిశీలిస్తే మిల్కీ ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేస్తోంది.

ప్ర‌స్తుతం మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ కీల‌క ద‌శ‌లో ఉంది. ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి చిత్రంలో ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. ఇది బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్వీన్ చిత్రానికి రీమేక్. మెగాస్టార్ చిరంజీవి సైరా-న‌ర‌సింహారెడ్డిలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఎఫ్ 2 – ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్ చిత్రంలోనూ మిల్కీ న‌టిస్తోంది. వీటితో పాటు క‌న్న‌డ‌లో కేజీఎఫ్ అనే భారీ చిత్రానికి సంత‌కం చేసింది. బాలీవుడ్‌లో కునాల్ కోహ్లీ చిత్రానికి సంతకం చేసింది. ఈ ట‌ర్నింగ్ ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం చేస్తున్న‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. స‌క్సెస్ వ‌స్తే చాలు జెట్‌స్పీడ్‌తో ఇంకా ఇంకా దూసుకుపోవ‌డం ఖాయం.

  •  
  •  
  •  
  •  

Comments