రేపిస్టుల‌కు మిల్కీ కోటింగ్‌

Friday, April 13th, 2018, 11:28:17 PM IST

ఇటీవ‌లి కాలంలో మ‌న క‌థానాయిక‌ల సామాజిక స్పృహ ఆల్వేస్ ట్రెండింగ్ అవుతోంది. సంఘంలో అనాదిగా పేరుకుపోయిన ప‌లు ర‌కాల ఝాడ్యాల‌పైనా మాట్లాడుతున్నారు. అరాచ‌కాలు, అఘాయిత్యాల్ని నిల‌దీస్తున్నారు. ఆ కోవ‌లోనే అత్యంత పాశ‌వికంగా అత్యాచారాల‌కు పాల్ప‌డే దుర్మార్గుల‌పై మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

“మ‌న దేశంలోని జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై దారుణంగా అఘాయిత్యం చేశారు. 16ఏళ్ల టీనేజీ గాళ్‌ని రేప్ చేసి, అలా చేసిన నిందితుడిని కాపాడేందుకు ఆమె తండ్రిని చ‌చ్చేలా కొట్టారు. ఇదేం దేశం. దేశాన్ని సంస్క‌రించే ముందు ఇంకెంత‌మంది నిర్భ‌య‌లు బ‌లి కావాలి. ఈ రావ‌ణ‌కాష్టం మారేదెప్ప‌డు?“ అంటూ ఎంతో ఉద్వేగంగా ప్ర‌శ్నించింది త‌మ్మూ. దేశం ఉన్న ప‌రిస్థితుల్ని బ‌ట్టి ప్ర‌మాద‌క‌ర‌ మెంటాలిటీ ఉన్న వారికి థెర‌పీ ఇవ్వాల‌ని త‌మ‌న్నా అంది.

  •  
  •  
  •  
  •  

Comments