రేస్ 3 ట్రైల‌ర్ దుమ్ము దుమారం

Wednesday, May 16th, 2018, 03:00:46 AM IST

స‌ల్మాన్ భాయ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం `రేస్ 3`. అనీల్ క‌పూర్‌, స‌న్నీడియోల్‌, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌, డెయిసీ షా ఇత‌ర కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్‌ రెమో.డి.సౌజా దర్శకత్వం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 3డిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాని కేవ‌లం 2డిలో మాత్ర‌మే తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చార‌మైనా.. అక‌స్మాత్తుగా 3డి వెర్ష‌న్ రిలీజ్ గురించి త‌ర‌ణ్ ఆద‌ర్శ్ లీక్ చేయ‌డంతో ఒక్క‌సారిగా ఆస‌క్తి రెట్టింపైంది. రేస్ సిరీస్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా అత్యంత క్రేజీగా 3డిలో ప్లాన్ చేశార‌ని భావించ‌వ‌చ్చు. అప్ప‌ట్లో రెమో.డి.సౌజా విదేశాలు వెళ్లి ప్ర‌త్యేకించి 3డి టెక్నాల‌జీపై శిక్ష‌ణ పొందార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అది ఏబీసీడీ 3 కోసం అని భావించినా ఊహించ‌ని రీతిలో స‌ల్మాన్ భాయ్ కోస‌మే ఈ శిక్ష‌ణ తీసుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. రేస్-1, రేస్ -2ల‌ను మించిన స్పైసీ- యాక్ష‌న్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ముఖ్యంగా స‌ల్మాన్ భాయ్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ నెక్ట్స్ లెవ‌ల్లో క‌నిపిస్తున్నాయి. స‌ల్మాన్ దుమ్ము దులిపేశాడు. బైక్ రేసింగ్‌, ఛేజ్ సీన్ల‌లో త‌డాఖా చూపించాడు. భారీ వెప‌న్స్‌ని చేత‌ప‌ట్టి ఆటాడుకున్నాడు. భీక‌ర‌మైన పోరాటాల‌తో రెమో ర‌క్తి క‌ట్టించే సీన్లు తీశాడ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఓ ర‌కంగా ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ బాలీవుడ్ రికార్డుల‌న్నిటినీ బ్రేక్ చేయ‌డం ఖాయం అన్నంత హైప్ ఈ ట్రైల‌ర్ ఇచ్చింద‌నే చెప్పాలి. రేస్‌1, రేస్ 2 చిత్రాల్ని మించి రేస్ 3పై అంచ‌నాలు పెరిగేందుకు 3డి ప్ర‌ధానంగా ఉప‌క‌రిస్తుంది. రొటీన్ 2డి వీక్ష‌ణ‌ను బోర్ ఫీల‌వుతున్న ఆడియెన్‌కి 3డిలో ఈ సినిమా నిజంగానే వెల్ ట్రీట్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు.