గత ప్రభుత్వం లో వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు – ఆళ్ళ నాని!

Friday, July 10th, 2020, 11:45:58 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నేతలు, ఇతర రాష్ట్రాల కి చెందిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 3000 బెడ్లు ఉన్నాయి అని, వాటిని 5000 కి పెంచుతాం అని మీడియా సమావేశం లో పేర్కొన్నారు.అయితే ఆసుపత్రుల్లో పలు సౌకర్యాల కోసం ల్యాబ్, ఎక్స్ రే, టాయిలెట్స్ నిర్మాణాల కోసం జిల్లాకి కోటి చొప్పున మంజూరు చేయనున్నాం అని అన్నారు.

అయితే కరోనా వైరస్ సోకిన వారికి కీలకం అయినా క్వారంటైన్ ఆహార సదుపాయాల పై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. జాయింట్ కలెక్టర్ లకు ఆ బాధ్యత అప్పగించాలి అని నిర్ణయం తీసుకున్న విషయం వెల్లడించారు.అయితే రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 500 రూపాయలు ఒక్కో వ్యక్తి కి రోజుకి ఖర్చు చేస్తుంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 సెంటర్ లలో 5874 మంది చికిత్స పొందుతున్న విషయాన్ని వెల్లడించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం జగన్ చేస్తున్న మంచి పనులను చూస్తూ విమర్శలు చేస్తున్నారు అని, గత ప్రభుత్వం లో వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.