పెట్టుబడులపై చంద్రబాబుని ప్రశ్నించిన మంత్రి అవంతి

Wednesday, August 14th, 2019, 01:19:53 AM IST

టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పెట్టుబడుల సదస్సుని నిర్వహించగా దానికి అధికంగా 8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. కాగా ఆ 8 లక్షల పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు. ఏపీలో అధికారాన్ని కోల్పోయినప్పటినుండి కూడా చంద్రబాబు మానసికంగా చాలా ఇబ్బంది పదుతున్నారని, అధికారంలేకపోతే చంద్రబాబు సరిగా బ్రతకలేకపోతున్నారని కానీ అధికారంలో ఉన్నప్పుడుకూడా చంద్రబాబు ప్రజలను ఎంత మాత్రానికి పట్టించుకోలేదని, కేవలం కాంట్రాక్టులకోసమే ఎక్కువగా శ్రద్ధ కనబరిచారని, కానీ ఇప్పటికి కూడా చంద్రబాబు ఇలా ఇంతలా దిగజారి మాట్లాడటం అనేది దారుణమని అవంతి అన్నారు.

ఇకపోతే ఎన్నికలకి ముందు వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పనిని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇకపోతే “టీడీపీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా భావించి దోచుకున్నారు. ఇప్పుడు దోపిడీ లేకుండా మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ ఆలస్యం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నా, మంచి కోసం కొంత సమయం అగాలని” పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలందరికోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో కూడా చాలా స్కామ్ జరిగిందని, పేదోడికి అన్నం పెట్టె పథకాన్ని రచించి దాంట్లో కూడా వారు జేబులు నింపుకున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ మిద తీవ్రమైన ఆరోపణలు చేశారు.