ఆ లక్ష 95 వేల కోట్ల వివరాలెక్కడ బాబు–మంత్రి బొత్స

Friday, February 14th, 2020, 05:53:42 PM IST

చంద్రబాబు నాయుడు వద్ద పని చేసినటువంటి మాజీ పీఎస్ ఫై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం ఫై మంత్రి బొత్స సత్య నారాయణ స్పందించారు. చంద్రబాబు తీరు ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దనే 2 వేల కోట్ల రూపాయలు బయటపడితే అక్రమాలు ఏ స్థాయిలో జరిగివుంటాయో తెలుసుకోవాలని ప్రజలకి హితబోధ చేశారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులేనని, అక్రమ లావాదేవీలపై చంద్రబాబు నోరు విప్పాలని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

గత ప్రభుత్వ హయం లో అవినీతి జరుగుట వలనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని మంత్రి బొత్స తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయినట్లు వివరించారు. అయితే లక్ష 96 వేల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు, ఎక్కడెక్కడ ఖర్చు చేసారో చెప్పలేదని అన్నారు. అప్పులు తీసుకొచ్చి మరి చంద్రబాబు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేసారు.