బిగ్ న్యూస్ : ఏపీ రాజధాని విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన బొత్స..!

Tuesday, July 7th, 2020, 08:55:10 AM IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచలనం రేపిన మరో కీలక అంశం రాజధాని తరలింపు కూడా ఒకటి. ఏపీకి రాజధాని మారితుందేమో అని అసలు విషయాన్ని వెల్లడించక ముందే వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ హింట్ ఇచ్చి కలకలం రేపారు.

అందుకు తగ్గట్టు గానే వైసీపీ అధిష్టానం కూడా రాజధాని తరలింపు ఖాయం అని చెప్పేసారు. అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా ఏపీకి మొత్తం మూడు రాజధానులు ఉంటాయని, వాటిలో అమరావతి శాసన మండలి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.

దీనితో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. ఇప్పుడు ఇదే అంశంపై అమరావతి పర్యటన చేసిన బొత్స మరోసారి రాజధానిపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్నది వై ఎస్ కోరిక అని దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్ తీర్చబోతున్నాడని తెలిపారు.

అంతే కాకుండా ఏపీలో మూడు రాజధానులు ఖచ్చితంగా ఉంటాయని అమరావతి కేవలం శాసన మండలి రాజధానిగా మాత్రమే కొనసాగుతుంది అని అందులో ఎలాంటి సందేహం లేదని పక్కా క్లారిటీగా తేల్చి చెప్పేసారు.