500 కాదు 1000 రోజులు చేయండి.. అమరావతి ఉద్యమంపై మంత్రి బొత్స కామెంట్స్..!

Saturday, May 1st, 2021, 03:00:25 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటితో 500 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఆనాడు రాజధానిని నిర్మిస్తామంటే తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అంటూ భూములిచ్చిన రైతులు ఉద్యమం మొదలుపెట్టారు. అంతేకాదు రాజధాని మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే రాజధాని మార్పు అంశంలో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూడు రాజధానులపై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 500 కాదు 1000 రోజులు ఉద్యమం చేయండి.. ఎవరు వద్దన్నారని వ్యాఖ్యానించారు. కోర్టులకు వెళ్ళడం వలనే అమరావతిలో ప్లాట్ల అభివృద్ధి ఆలస్యమవుతుందని మంత్రి బొత్స అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.