పవన్ విషయంలో సీఎం జగన్ చేసిన వాఖ్యలు సరైనవే – మంత్రి బొత్స సంచలన వాఖ్యలు

Thursday, November 14th, 2019, 01:00:45 AM IST

బుధవారం నాడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ఇటీవల సీఎం జగన్ జనసేన పార్టీ అధినేత పై చేసిన వాఖ్యాలను సమర్ధించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా పవన్ విషయంలో సీఎం జగన్ చేసిన వాఖ్యల్లో తప్పు లేదని, రాష్ట్రంలోని పిల్లలందరికోసం సీఎం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోడానికి విపక్షాలు ఏకమయ్యాయని బొత్స తీవ్రారోపణలు చేస్తున్నారు. కాగా సీఎం జగన్ ఉన్నమాటే చెప్పారని, పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారని మంత్రి తెలిపారు.

ఇకపోతే చిన్నప్పటినుండి పిల్లలందరికీ కూడా ఇంగ్లిష్ మీడియం అలవాటు చేస్తేనే పిల్లలందరూ కూడా అభివృద్ధి పథంలో ఉంటారని అన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పని చేసిన కూడా విమర్శించడమే ఒక బాధ్యతగా పెట్టుకున్న విపక్షాల మాటలు పట్టించుకోవద్దని, ఎవరెన్ని చెప్పిన కూడా సీఎం జగన్ ఈ విషయంలో వెనకడుగు వేయబోడని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.