అమరావతి నిర్మాణం పై సంచలన ప్రకటన చేసిన మంత్రి బుగ్గన

Thursday, July 18th, 2019, 03:00:07 AM IST

అధికార పార్టీ వైసీపీ మీద, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపార్టీ నిరంతరం తీవ్రమైన విమర్శలు చేస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తుంది. దానికితోడు అమరావతిలో నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని, భూముల రేట్లు ఘోరంగా పడిపోయాయని మీడీయాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఈ విషయం మీద ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. “రాజధాని నిర్మాణం కొరకు పలు దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించార”ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే రాజధాని పేరుతొ చంద్రబాబు చాలా అక్రమాలకు పాల్పడ్డాడని, ఈ 5 సంవత్సరాల్లో 1700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా, దాంట్లో సగం కేంద్రం నిధులు సమకూర్చిందని అన్నారు.

అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తోలి బడ్జెట్ లోనే రాజధానికి 500 కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పుకున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం లో టీడీపీ నిర్మించిన భవనాల్లో సరైన వసతులు లేవని, అన్ని పేలవంగా ఉన్నాయని బుగ్గన గుర్తు చేశారు. అయితే తన ప్రభుత్వ హయాంలో కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే విడ్డురంగా ఉందని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన అన్నారు.