అవసరం ఉంటే తప్ప ఇంటినుండి బయటికి రావద్దు.. మంత్రి ఈటల సజేషన్..!

Tuesday, April 6th, 2021, 03:00:07 AM IST


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపధ్యంలో నేడు మీడియాతో మాట్లాడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వేగంగ్గా విస్తరిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. కరోనా పట్ల వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల నుండి గ్రామాల్లోకి వచ్చే వారిపై కూడా దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

అయితే 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరం విధిగా వాక్సిన్ వేయించుకోవాలని మంత్రి ఈటల చెప్పుకొచ్చార్రు. మాస్క్ ధరించడం, అలాగే చేతులు తరచుగా శుభ్రం చేయడం, భౌతిక దూరం పాటిచాలని సూచించారు. అవసరం ఉంటే తప్ప ఇంటినుండి బయటికి రావొద్దని, కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని అన్నారు.