ప్రజలు అలా చేయకపోతే అవే కరోనా కేంద్రాలు గా మారే ప్రమాదం ఉంది!

Wednesday, July 1st, 2020, 09:11:28 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉంది. అయితే వ్యాప్తి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే కరోనా వైరస్ పరీక్షలను పెంచదం ద్వారా ఒక్కసారిగా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు వస్తున్నారు అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

అయితే అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అని, అందుకోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. అయితే వీటి వద్దకు వచేపుడు ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు విధిగా ధరించాలి అని వ్యాఖ్యానించారు. లేదంటే అవే కరోనా కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది అని తెలిపారు. అయితే కరోనా వైరస్ బాధితుల కోసం మంత్రి ఈటెల రాజేందర్ కొన్ని సూచనలు తెలిపారు.

లక్షణాలు తక్కువగా ఉన్న వారు ఇంట్లోనే స్వీయ నిర్బంధం లో ఉండాలి అని అన్నారు.తక్కువ లక్షణాలు ఉన్న వారిని పరీసిలిం చాలని, ఉదయం, మధ్యాహ్నం ఫోన్ ద్వారా పరిస్తితి ను ఆరా తీయాలి అని వ్యాఖ్యానించారు.అంతేకాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది అని వ్యాఖ్యానించారు.