పేదల ఆకలి తీర్చడానికే ఉచిత బియ్యం పంపిణీ – గంగుల కమలాకర్

Sunday, June 6th, 2021, 09:05:45 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే లాక్ డౌన్ మరియు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కష్టకాలం లో పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్ల కార్డు ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 15 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే కొత్త పల్లిలోని రేషన్ షాపు లు గంగుల కమలాకర్ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం లో 53.56 లక్షల కార్డులకు రెండు నెలల కోసం కేంద్రం ఉచితంగా అందించే పది కిలోల బియ్యం తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యం ను కార్డు దారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే సుమారు 2.80 కోట్ల మందికి 4.31 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 92 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది అని వ్యాఖ్యానించారు. అయితే ఈ నెల 20 వ తేదీ వరకు రాష్ట్రం లో బియ్యం పంపిణీ కొనసాగుతోంది అని అన్నారు. అయితే పేదల కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు.